భోజనానికి ముందు నీళ్లు తాగితే…విషమా?

Breaking News

భోజనానికి ముందు నీళ్లు తాగితే…విషమా?

బరువు తగ్గడం ప్రస్తుతం చాల పెద్ద సమస్యగా మారింది. అందమైన శరీరాకృతి కోసం కొంత మంది ఆరాట పడితే, ఆరోగ్యం గా ఉండేందుకు మరికొంతమంది బరువు తగ్గాలను కుంటారు. సహజ సిద్దంగా బరువు తగ్గేందుకు అనేక మార్గాలున్నాయి. వీటిలో నీరు ప్రధాన పాత్ర వహిస్తుంది. నీటితో బరువు తగ్గవచ్చు అనేది చాలామందికి తెలియదు. ఎందుకంటే శరీరంలో జరిగే మెటబాలిజానికి నీరే ముఖ్యం. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల జరిగే కెమికల్‌ రియాక్షన్స్‌తో రక్త కణాలు ఆరోగ్యం గా ఉంటాయి. శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ.. బరువు తగ్గడానికి దోహదపడతాయి. ఇటీవల జరిగిన ఒక సర్వే ప్రకారం నీరు సమృద్ధిగా తీసుకుంటే ఆకలి త్వరగా కాదని స్పష్టమైంది. అందుకే బరువు తగ్గడానికి నీటిని వివిధ రకాలుగా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా నీటితో బరువు తగ్గడం అనేది ఎవరికీ ఇబ్బందిలేని, ఎలాంటి ఖర్చులేని సహజ సిద్ధమైన ప్రక్రియ. భోజనం చేసే ముందు కడుపు నిండా నీరు తాగాలి. కేవలం బరువు తగ్గాలనుకునే వారు మాత్రమే. ఇలా చేయడం వల్ల భోజనాన్ని అతిగా తీసుకోకుండా జాగ్రత్త పడొచ్చు. ప్రతీ రోజు ఇలా చేయడం వల్ల సుమారు 75 క్యాలరీలు పొదుపు చేయవచ్చు. అంటే ఏడాదిలో సుమారు 27,375 క్యాలరీలు పొదుపు చేసి.. 4 కేజీలు బరువు సహజ సిద్దంగా తగ్గవచ్చు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *