శ్రీరాంపూర్‌లో టీడీపీ రాస్తారోకో

Breaking News

శ్రీరాంపూర్‌లో టీడీపీ రాస్తారోకో

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని, ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు జక్కుల రాజేశం, జెడ్పీటీసీ తిప్పని రామయ్య మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీవారే అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై కేంద్రం పెట్రోల్ ధర పెంచి మరింత భారం మోపిందన్నారు. తక్షణమే పెంచిన పెట్రోల్ ధర తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సింగపూర్ సర్పంచ్ గుంట జెగ్గయ్య, పార్టీ మండల నాయకులు పెద్దపల్లి శంకర్, గణపతిరెడ్డి, అరుణ్‌కుమార్, శ్యాంసుందర్, ఎంపీటీసీలు తలారి రాజు, పంబాల కోమల తిరుపతి, తెలుగు మహిళ నేతలు బండి పద్మ, జాన్సీ, పార్టీ నాయకులు శేట్టి శ్రీనివాస్, ఒగ్గే తిరుపతి, జక్కుల కుమార్, వేల్పుల రవిందర్ తదితరులు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *