Monthly Archives - January 2011

Breaking News

కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలి

-టీడీపీ జిల్లా అధ్యక్షుడు గోనె హన్మంతరావు

Gone Hanmantha Rao - TDP District President - Adilabadతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రణబ్‌ముఖర్జీకి ఇచ్చిన లేఖ కు కట్టుబడి ఉంటుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గోనె హన్మంతరావు అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఐబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ కోసం పోరు చేయడానికి టీడీపీ తెలంగాణ ఫోరంతో సీపీఐ కలిసివస్తుందని చెప్పారు. మరో కొత్త జేఏసీ అధ్వర్యంలో ఉద్యమించడానికి సన్నాహలు చేస్తున్నట్లు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించా రు. పెట్రోల్ ధర పెంచి ప్రజలపై మరింత భారం మోపారన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితతో అభివృద్ధి కుంటు పడిందన్నారు. సమవేశంలో టీడీపీ నాయకుడు కె.వి. ప్రతాప్, పట్టణ అధ్యక్షుడు బెల్లంకొండ మురళీధర్, ప్లోర్‌లీడర్ ముఖేశ్‌గౌడ్ పాల్గొన్నారు.

శ్రీరాంపూర్‌లో టీడీపీ రాస్తారోకో

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని, ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు జక్కుల రాజేశం, జెడ్పీటీసీ తిప్పని రామయ్య మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీవారే అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై కేంద్రం పెట్రోల్ ధర పెంచి మరింత భారం మోపిందన్నారు. తక్షణమే పెంచిన పెట్రోల్ ధర తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సింగపూర్ సర్పంచ్ గుంట జెగ్గయ్య, పార్టీ మండల నాయకులు పెద్దపల్లి శంకర్, గణపతిరెడ్డి, అరుణ్‌కుమార్, శ్యాంసుందర్, ఎంపీటీసీలు తలారి రాజు, పంబాల కోమల తిరుపతి, తెలుగు మహిళ నేతలు బండి పద్మ, జాన్సీ, పార్టీ నాయకులు శేట్టి శ్రీనివాస్, ఒగ్గే తిరుపతి, జక్కుల కుమార్, వేల్పుల రవిందర్ తదితరులు పాల్గొన్నారు.

Sri Krishna Commitee Report in Telugu Version

Sri Krishna Commitee Report now available in Telugu Version at our website www.mancherialcity.com. Committee Report total pages 267, 9 chapter, read chapter wise are full report.
.
.
.
.
.
.

ఎక్కడికక్కడే…

mancherial-ib-trsపార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ శ్రేణులు రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలు పు మేరకు రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ రహదారులను దిగ్బంధించారు. ఆదిలాబాద్ శివారుల్లోని జైనథ్ మండలం పెన్‌గంగా వద్ద ఎన్‌హెచ్-7 పై తెలంగాణ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపైనే వంట చేసి ఆరగించారు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రైల్‌రోకో నిర్వహించారు. నిర్మల్ శివారులోని సోన్ వద్ద జాతీయ రహదారిపై నాలుగు గంటలు రాస్తారోకో నిర్వహించారు. వంటవార్పు చేసి నిరసనలు తెలిపారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లోని అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద రాస్తారోకో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి, జేఏసీ నాయకులు ఆందోళన నిర్వహించారు.

దండేపల్లి, హాజిపూర్‌లో రాస్తారోకోలు జరిపి రోడ్లపై వంటావార్పు చేశారు. అదేవిధంగా రెండు గంటలు రోడ్డు దిగ్బంధనం చేశారు. టీఆర్‌ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షులు పురాణం సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో చెన్నూర్‌లో రోడ్లను దిగ్భందం చేశారు. తాండూర్, కాసిపేట, నెన్నెల, భీమిని, వేమనపల్లిలో రోడ్డుపై చకినాలు చేసి నిరసన తెలిపారు. భైంసా, ముథోల్, తాండూర్, మాటేగాం, కల్లూర్, బోసీలలో రాస్తారోకోలు నిర్వహించారు. కాగజ్‌నగర్ ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సిర్పూర్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో జొన్న గటుక, చేపలపులుసు పంచి పెట్టి నిరసన తెలిపారు. ఆసిఫాబాద్‌లోని అంతరాష్ట్ర రహదారిపై శ్రీకృష్ణ కమిటీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కెరమెరిలో శ్రీకృష్ణ కమిటీ శవయాత్రను నిర్వహించారు.

నిర్మల్‌లో శివాజీచౌక్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట తెలంగాణశ్రేణులు ఆందోళన నిర్వహించారు. లక్సెట్టిపేటలో మండల శాఖ రాజకీయ జేఏసీ కన్వీనర్ నైనాల గోవర్దన్ ఆధ్వర్యంలో కనకపూర్, మామడలో రాస్తారోకో నిర్వహించారు. సారంగపూర్ మండలం దిలావర్‌పూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, జన్నారంలలో రాస్తారోకోలు నిర్వహించారు. ఆంధ్ర సరిహద్దులోని బోథ్, తలమడుగు మండలాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. తెలంగాణ సాధన కోసం ఏఐటీయుసీ సిద్ధమైంది. సింగరేణి సంస్థల్లో కార్మికులు నల్లాబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కాసిపేట, బెల్లంపల్లి సింగరేణి కార్మికులు నిరసన తెలిపారు. మంచిర్యాలలో తెలంగాణ కళాకారులు ధూంధాం కార్యక్రమాన్ని నిర్వహించారు. మందమర్రిలో తెలంగాణ కోసం మల్లేశ్ అనే యువకుడు చేయి కోసుకున్నాడు.