సింగరేణి ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్దం

Breaking News

సింగరేణి ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్దం

singareni collieries company limitedసింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మణుగూరు ముస్తాబైంది. తొలిసారి కంపెనీస్థాయి వేడుకలు మణుగూరు ఏరియాలో జరుగుతుండగా, పీవీకాలనీ భద్రాద్రి స్టేడియాన్ని యాజమాన్యం అందంగా తీర్చిదిద్దింది. బుధవారం ఉదయం సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా జీఎం ఆర్ఎస్ మంత్రి వేడుకలను లాంఛనంగా ప్రారంభించనుండగా, రెండు రోజుల పాటు ఇవి జరుగుతాయి. స్టాల్స్ నిర్మాణాల కోసం భారీ షామియానాలు ఏర్పాటు చేయగా, సివిల్(ఎస్ఇ) శివరావు ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చురుకుగా జరిగాయి. ఎస్ఓటు జీఎం ఎంఎస్ వెంకట్రామయ్య, పీకేఓసీ ఏజీఎం విజయ్‌పాల్‌రెడ్డి, డీజీఎం(పర్సనల్) మాజేటి రామకృష్ణ, డీజీఎం (ఇఅండ్ఎం) బాలకోటిరెడ్డి మంగళవారం భద్రాద్రి స్టేడియంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు.

గత ఏడాది కన్నా ఈ సారి భద్రాద్రి స్టేడియాన్ని అందంగా తీర్చిదిద్దారు. కార్మిక కుటుంబాలతో పాటు మణుగూరు పట్టణానికి చెందిన అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాలను తిలకించేందుకు తరలిరానున్నారు. ఉత్సవాలు జరిగేదిలా.. 22వ తేదీ ఉదయం 9.00 గంటలకు భద్రాది స్టేడియంలో జీఎం ఆర్ఎస్ మంత్రి వేడుకలను ప్రారంభించనున్నారు. సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 23 సాయంత్రం కార్యక్రమానికి సింగరేణి చైౖర్మన్ నర్సింగ్‌రావు, గుర్తింపు, సంఘాల నేతలు హాజరవుతున్నారు. జయప్రదం చేయండి: ఛీప్ కో-ఆర్డినేటర్.. సింగరేణిడే వేడుకలను కార్మిక కుటుంబాలు, ప్రజలు విజయవంతం చేయాలని ఉత్సవాల చీఫ్ కో-ఆర్డినేటర్ వెంకట్రామయ్య విఙ్ఞప్తి చేశారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *